22-02-2025 01:39:29 AM
బాన్సువాడ ఫిబ్రవరి 21 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని బీర్కూరు మండల దామరంచ గ్రామానికి చెందిన డీసీసీబీ డైరెక్టర్ కమలాకర్ రెడ్డి తల్లి గౌరమ్మ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెంద డంతో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మృతికి ప్రగాఢ సాను భూతిని తెలియజేశారు. పరామర్శించిన వారిలో కాంగ్రెస్ నాయకులు పాత బాలకృష్ణ, అంజాద్, మంత్రి గణేష్, వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.