calender_icon.png 23 February, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేరళలో ఏనుగుల బీభత్సం

14-02-2025 11:35:29 PM

తొక్కిసలాటలో ముగ్గురి దుర్మరణం..

30 మందికి పైగా గాయాలు..

త్రివేండ్రం: కేరళలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గుడి వద్ద పటాకులు పేలడంతో భీతిల్లిన ఏనుగులు పరుగులు పెట్టగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, సుమారు 30 మంది గాయాలపాలయ్యారు. త్రిస్సూర్ జిల్లా కోయిలాండి ప్రాంతంలోని కురవంగాడ్ మనకులంగ ఆలయ ప్రాంగణంలో గురువారం సాయంత్రం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిర్వాహకులు పటాకులు పేల్చారు. దీంతో ఏనుగులు భీతిల్లి పరుగులు పెట్టాయి. రెండు ఏనుగులు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో, రెండింటి మధ్య పోట్లాట జరిగింది. అది కాస్త తొక్కిసలాటకు దారి తీసింది. ప్రమాదంలో అమ్ముకుట్టి (70), లీలా (65), రాజన్ (70) తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు.