12-02-2025 08:18:50 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): 74 వసంతాలు పూర్తి చేసుకొని 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విద్యుత్ శాఖ ఉద్యోగుల 1104 యూనియన్ కంపెనీ రిటైర్డ్ ఫార్మెన్ మెట్టు రాజేశ్వర్ రావు జెండా ఆవిష్కరించారు. బుధవారం పట్టణంలోని విద్యుత్ ఏ.ఈ కార్యాలయం వద్ద సభ్యులతో కలిసి మాట్లాడారు. యూనియన్ వల్ల ఎన్ని అడ్డంకులు ఉన్న ఎదుర్కోవచ్చని అన్నారు. విద్యుత్ పనుల్లో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నర్సింగ రావు, శంకరయ్య, చంద్రమౌళి, రాజమౌళి సెక్షన్ సిబంది తదితరులు పాల్గొన్నారు.