calender_icon.png 26 October, 2024 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ

02-09-2024 06:33:45 PM

యాదాద్రి భువనగిరి, (విజయక్రాంతి): విద్యుత్ బీసీఓసి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్4వ తేదీన విద్యుత్ సౌదా ముట్టడి మహాధర్నా  కార్యక్రమం తలపెట్టడం జరిగింది. కావున ఈరోజు సర్కిల్ ఆఫీస్ ఆవరణలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ మరియు సన్నాహక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది . ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం  ఓసి మరియు బీసీలకు విద్యుత్ సంస్థలో కల్పించిన పదోన్నతులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశం తేదీ24-10-2019 గౌరవ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తరువు W. P. No 4414 /2016 తేదీ10-12-2018 మరి హైకోర్టు ఉత్తరువు W. P. NO47125/2018 తేదీ 4-2-2019 ప్రకారం.. జూన్ 2, 2014 నుండి నష్టపోయిన బీసీ, ఓసి ఉద్యోగులకు పదోన్నతులను కల్పించాలి.

 అదేవిధంగా విద్యుత్ సంస్థలో అన్ని కేడర్లలో నేరుగా నియమింపబడుతున్న ఉద్యోగులను సీనియార్టీ మెరిట్ ఆధారంగా సర్వీస్ రెగ్యులేషన్ 26(a) పార్ట్-11, తెలంగాణ స్టేట్ సబ్ ఆర్డినేటర్ రూల్స్ 33(b), 36(i) హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రకటించాలి. విద్యుత్ సంస్థలో పనిచేసిన ఆర్టిజన్ కార్మికులకు ఏపీ రూల్స్ ను వర్తింపజేసి అర్హత ఆధారంగా పదోన్నతులు కల్పించాలి అని ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్స్ పెట్టడం జరిగింది. ఈ  కార్యక్రమానికి సీనియర్ అకౌంట్ ఆఫీసర్ బాలచంద్రుడు ముఖ్యఅతిథిగా పాల్గొని సందేశం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి యాదాద్రి జిల్లా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొబ్బిలి మురళి, ఓసి నాయకులు భూపాల్ రెడ్డి, బీసీ నాయకులు మరి, మహిళా నాయకులు విజయ రెడ్డి, శ్రీదేవి, రవికుమార్, వెంకటేష్, సిద్ధి లింగం, బి.నరసింహ, సబ్ ఇంజనీర్లు మానస, ఉమా, అలాగే సర్కిల్ ఆఫీస్ కి సంబంధించిన ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.