పాల్వంచలో దివ్యాంగుల పాఠశాలకు చెక్కును అందజేస్తున్న ఎస్ఈ మహేందర్
ఎంపీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 14 (విజ యక్రాంతి): వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఎంపీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రాత్రి కొత్తగూ డెంలోని సింగరేణి గెస్ట్‌హౌస్‌లో జిల్లా విద్యు త్ అధికారులతో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు.
ఉద్యోగుల సహ కారంతో ఏర్పాటు చేసిన టీజీఎన్ పీడీసీఎల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం పాల్వంచ లోని శాంతి వెల్ఫేర్ అసోసియేషన్ (దివ్యాం గుల పాఠశాల)కు రూ.20 వేల చెక్కును ఎన్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ సూపరింటిం డెండ్ ఇంజనీర్ మహేందర్ అందజేశారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.