28-02-2025 01:31:01 AM
తిరుమలగిరి : అధికారుల నిర్లక్ష్యం అవినీతి మూలంగా గత కొంతకాలంగా శ్మశాన వాటిక ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ నుండి అక్రమంగా విద్యుత్తు వాడుకుంటున్న క్రషర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు కోరుతున్నారు ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా స్మశాన వాటిక కోసం ఏర్పాటుచేసిన విద్యుత్తు లైన్ నుండి కొన్ని రోజులుగా క్రషర్ యజమాని విద్యుత్తును వినియోగించుకుంటున్నప్పటికీ కూడా అధికారులు గుర్తించడంలో విఫలమయ్యారని ప్రజలు తెలిపారు.
ప్రతినెల విద్యుత్ బిల్లు తనిఖీల కోసం వెళుతున్న సంబంధిత ట్రాన్స్కో లైన్మెన్ తో పాటు సిబ్బంది తమకేమీ పట్టనట్లు వివరిస్తూ ప్రభుత్వ ఆదాయం పోతుందని పరువు తెలిపారు. గ్రామ ప్రాంతాల్లో శ్మశానవాటికలను ప్రభుత్వం ఏర్పాటు చేసి మృతుల కుటుంబీకులు స్నానాలు చేయడానికి వీలుగా విద్యుత్తు లైను ఏర్పాటుచేసిన అది కొంతమంది అక్రమార్కులకు అనుగా మారిందని తెలిపారు.
ఇప్పటికే కొంతకాలంగా యజమాని అక్రమంగా వాడుకుంటున్న విద్యుత్ చౌర్యంపై సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒక పేదవాడు తమ అవసరాల కోసం విద్యుత్తును వాడుకుంటే కావాలనే అధికారులు అతనిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నప్పటికీ నేటి వరకు క్రషర్ యజమానిపై ఎందుకు విద్యుత్ చౌర్యం కేసు నమోదు కలేదో అర్థం కావడం లేదని పనులు తెలిపారు