calender_icon.png 12 March, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ అధికారుల అత్యుత్సాహం..

12-03-2025 05:48:01 PM

రామయంపేట,(విజయక్రాంతి): విద్యుత్ శాఖ అధికారులు పేదవారిపై తమ అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు. రామయంపేట పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటున్న రాజు అనే వ్యక్తి ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది. కేవలం 500 రూపాయలు బిల్లు చెల్లించాల్సి ఉండగా అధికారులు తక్షణమే చెల్లించాలని ఒత్తిడి చేశారు. తనకు కొంత సమయం కావాలని ఎంత ప్రాధేయపడిన ఆ ఏరియాకు సంబంధించిన స్థానిక లైన్మెన్ వినిపించుకోకపోగా కరెంట్ కట్ చేసి వెళ్లాడు. ఒక్కొక్కరు నెలల తరబడి చెల్లించని వారిని కనీసం ప్రశ్నించడం లేదని నిరుపేద అయిన తన పట్ల కావాలని ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు కూడా వేళల్లో ఉన్న కరెంట్ బిల్లులు వసూలు చేయడంలో ఈ ఉత్సాహం చూపడం లేదనీ బాధితుడు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. పలుకుబడి ఉన్న వ్యక్తులు ఏప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటున్నారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయమై విద్యుత్ శాఖ ఏఈ తిరుపతి రెడ్డిని అడగగా తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని బకాయిలు ఎక్కడ కూడా లేకుండా వసూలు చేస్తున్నామని తెలిపారు.