డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జనవరి 23 ( విజయక్రాంతి): వచ్చే వేసవిలో విద్యుత్ సరఫరాలో వినియోగదారులకు అంతరాయం లేకుండా చూడాలని, డిమాండ్‌కు తగ్గట్టు కరెంట్ సరఫరా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్‌లో గురువారం ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వేసవి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడంలో సీఎండీలు, ఎస్‌ఈలీలు క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించాలన్నారు. మీడియాను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు. 108 తరహాలలోనే విద్యుత్ సరఫరాలో సమస్యలపై వినియోగదారులు ఫిర్యాదు చేయడానికి ఏర్పాటు చేసిన 1912ను విస్తృతంగా ప్రచారం చేయాలని, వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని భట్టి సూచించారు.
సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరణ్‌రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.