calender_icon.png 7 March, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి గంగారం సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా

05-03-2025 01:10:46 AM

ఎస్ ఈ మహేందర్

అశ్వరావుపేట మార్చి 4 (విజయ క్రాంతి): రానున్న వేసవి కాలంలో విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండేం దుకు అన్ని జాగ్రత్తలు చేపడుతున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ మహేందర్ తెలిపారు. మంగళవారం గంగారాం 132 కెవి సబ్స్టేషన్ నుండి కొత్త 33 కెవి గట్టుగూడెం ఫీడర్ ను ఆయన ప్రారంభించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి చర్యల ప్రణాళిక  (సమ్మర్ యాక్షన్ ప్లాన్)లో భాగంగా అశ్వరావుపేట మండలం గంగారాం 132 కెవి సబ్స్టేషన్ నుండి కొత్త 33 కెవి గట్టుగూడెం ఫీడర్ ను ప్రారంభిం చామన్నారు.

ఇప్పటికే 344 ఏఎంపీఎస్ వరకు లోడ్ పొందుతున్న 33 కెవి మందలపల్లి ఫీడర్ నుండి లోడ్ విభజన చేయడానికి చేపట్టిన  తాజా విభజన చర్య అన్నారు. దీని ద్వారా 110 ఏఎంపీఎస్ కొత్త 33 కెవి గట్టుగూడెం ఫీడర్ కు మార్చి, ప్రస్తుతం 33 కెవి మందలపల్లి ఫీడర్ లోడ్ 220 ఏఎంపీఎస్ కు తగ్గించామన్నారు. ఈ కొత్త ఫీడర్ ప్రారంభంతో, మందలపల్లి ఫీడర్ పై భారాన్ని తగ్గించడం ద్వారా మరింత మెరుగైన , నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు  విద్యుత్ సరఫరా అందించడానికి దోహద పడిందని తెలిపారు.