రాజన్న సిరిసిల్ల, జూలై10 (విజయక్రాంతి): సిరిసిల్లా జిల్లా సెస్ పరిధి లోని పవర్ లూమ్‌లకు 10హెచ్‌పీ వరకు విద్యుత్ సబ్సిడీ ఉంటుందని సెస్ పరిపాలక సంచాలకుడు శ్రీనివాస్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. యజ మానులు తమ పవర్ లూమ్స్‌నకు ఒకటి కన్నా ఎక్కువ సరీస్ కనెక్షన్లు ఉన్నవారు రెండు సర్వీస్ కనెక్షన్లు (మీటర్లు) పవర్ లూమ్స్‌కు వాడుకొని మిగిలిన వాటిని తిరిగి సంస్థకు వాప సు చేయాలని సూచించారు. వాపసు చేసే సరిస్ కనెక్షన్లపై ప్రస్తుతం బకాయిలు చెల్లించి వాటిని సరెండర్ చేసు కోవచ్చని వివరించారు. సరీస్ కనెక్ష న్ వాడుకోబడని మీటర్లపై తదుపరి బిల్లు రాకుండా, ప్రస్తుతం మిగిలిన సరీస్ కనెక్షన్ 10హెచ్‌పీ లోపల వాడుకున్నట్లయితే సబ్సిడీకి అర్హులు గా చేనేత కార్మికులకు లాభం చేకూరేలా పాలకవర్గం నిర్ణయం తీసుకుం దని తెలిపారు.