calender_icon.png 21 February, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవసరాల మేరకే విద్యుత్త్ వాడుకోవాలి

18-02-2025 12:48:20 AM

ఉత్తర విద్యుత్ సంస్థ ఎస్‌ఈ శ్రావణ్ కుమార్

కామారెడ్డి, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి), రైతులు తమ వ్యవసాయ పంటలకు అవసరమైన విద్యుత్ ను పొదుపుగా వాడుకోవాలని ఉత్తర తెలంగాణ విద్యుత్ సమస్త ఎస్ ఈ శ్రావణ్ కుమార్ అన్నారు. సోమవారం కామారెడ్డి మండలం తిమ్మపల్లిలో పోలంబడి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.

రైతులకు ఎలాంటి విద్యుత్ సమస్యలు కలిగిన వెంటనే ట్రాన్స్ఫార్మర్ వద్ద గల టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. విద్యుత్ సిబ్బంది లేకుండా ట్రాన్స్ఫార్మర్లను రైతులు ముట్టుకోకూడదని అన్నారు.ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయని రైతులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

రైతులకు ఎలాంటి ఆపాయాలు జరగవద్దని ఉద్దేశంతోనే ప్రభుత్వం రైతులను చైతన్యవంతం చేసేందుకే పొలంబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన రిపేర్ కోసం డబ్బులు ఇవ్వవద్దని ప్రభుత్వమే రిపేర్ చేసి ఉచితంగా ఇస్తుందని అన్నారు.

ప్రయాణ ఖర్చులు సైతం విద్యుత్ సంస్థ నే భరిస్తుందని తెలిపారు. విద్యుత్ ను వృధా చేయరాదని తెలిపారు. పంటలకు సరిపడా విద్యుత్తును అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఉత్తర విద్యు త్ సంస్థ ప్రతినిధులు డి ఈ  కళ్యాణ్ చక్రవర్తి ఏ డి ఈ కిరణ్ చైతన్య, కామారెడ్డి రూరల్ ఏఈ శ్రీనివాస్, రైతులు సాయి రెడ్డి భరత్ కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.