ఛార్జీల భారం ఇబ్బందికరం
సీఈఏ అనంత నాగేశ్వరన్
న్యూఢిల్లీ: రాష్ట్రాలు వ్యాపార రంగంలోని సంస్థలపై కరెంటు ఛార్జీలను భారీ మోపుతున్నాయని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక సర్వే- 2025 విడుదల అనంతరం ఆయన విలేకర్లతో సమావేశమయ్యారు. మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకణలు చాలా కీలకమని పేర్కొన్నారు.
మార్పులో గ్లోబలైజేషన్ కీలక శక్తిగా పేర్కొన్న ఆయన.. ప్రపంచ స్థాయిలో జీవన ప్రమాణాలను, అనుసంధానతను పెంచింది, వ్యయాలను తగ్గించిందని అభివర్ణించారు. ప్రపంచ స్థాయిలో చైనా అత్యంత వేగంగా ఎదుగుతోందని నాగేశ్వరన్ వెల్లడించారు.
కేవలం 10 ఏళ్ల కాలంలోనే ప్రపంచంలోనే 70శాతం సౌరశక్తి ఆధారిత విద్యుత్తు తయారీ కేంద్రంగా మారిందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలపై నియంత్రణలను తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
“వేగవంతమైన ఆర్థిక వృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణలను చేసి.. చిన్న, మధ్యతరగతి సంస్థలు వ్యయ నియంత్రణలతో, పోటీగా నిర్వహించేలా తయారు చేయాలి” అని పేర్కొన్నారు.
తప్పుడు వాణిజ్య ప్రకటనలు, సెలబ్రిటీల ఎండార్స్‌మెంట్లు, అస్పష్టమైన లేబులింగ్‌లు ్ల ఆందోళనకరమన్నారు. ముఖ్యంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌ను ఈ విధానాల్లో అమ్మడం వినియోగదారుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ముప్పు ఉంది. క్యాన్సర్లు, శ్వాస సంబంధ సమస్యలు, గుండెజబ్బులు, జీర్ణకోశ సమస్య ల ముప్పు పొంచిఉందని పేర్కొన్నారు.