05-03-2025 12:39:18 AM
పటాన్‌చెరు, మార్చి 4: జిన్నారం మండలంలోని వావిలాల, నల్తూరు, లక్ష్మిపతిగూడెం, ఖాజీపల్లి, గడ్డపోతారం గ్రామాలలో పటాన్ చెరు విద్యుత్ డివిజనల్ ఇంజనీరింగ్ అధికారి భాస్కర్ రావు మంగళవారం పర్యటించారు. ఎండాకాలం సందర్భంగా ఆయా గ్రామాలలో పర్యటించి రైతులతో మాట్లాడారు.
ట్రాన్స్ ఫార్మర్స్ పనితీరు, విద్యుత్ సరఫరాలో లోపాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సిబ్బంది దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యుత్ వినియోగదారులతో సిబ్బంది స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. గుమ్మడిదల ఏడీఈ దుర్గా ప్రసాద్, జిన్నారం ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.