calender_icon.png 26 April, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంగిన విద్యుత్ స్తంభాలు.. పొంచి ఉన్న ప్రమాదం

25-04-2025 07:12:02 PM

పట్టించుకోని విద్యుత్ అధికారులు..

ప్రాణాలు పోతేనే స్పందిస్తారా విద్యుత్ అధికారులు..

బొంపల్లి గ్రామస్తుల ఆవేదన..

కామారెడ్డి (విజయక్రాంతి): ఇటీవల ఈదురుగాలులు వీయడం, అకాల వర్షాలు కురవడంతో రోడ్డు పక్కన వేసిన విద్యుత్ స్తంభాలు నేలకోరుగుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ స్తంభాలు నేలకోరిగాయని సరి చేయాలని విద్యుత్ అధికారులకు గ్రామస్తులు పలుసార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదు. రోడ్డు పక్కన వెళ్లాలంటే ఏ విద్యుత్ స్తంభం ఏ గాలికి విరిగిపడుతుందని ఆందోళన చెందుతున్నారు.

విద్యుత్ శాఖ అధికారులకు ఈ సమస్యపై ఎన్నిసార్లు వినియోగించిన మరమ్మతులు చేపడతామని హామీ ఇస్తున్నారు తప్ప పట్టించుకోవడం లేదు.  బొంపల్లి గ్రామం నుంచి గాంధారి రోడ్డు వరకు వేసిన విద్యుత్ స్తంభాలు ఈదురు గాలులకు వంగిపోయి ప్రమాదాలకు నిలయంగా మారాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి శిథిలావస్థకు చేరిన వంగిపోయిన విద్యుత్ స్తంభాలను సరిచేసి వాటి స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలు అమర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలము భూంపల్లి గ్రామంలో ఉన్న ఐదుగుళ్ల వద్ద కిందికి వంగిన విద్యుత్ స్తంభాలతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు. కొన్ని నెలలుగా విద్యుత్ స్తంభాలు కిందికి వ0గడం విద్యుత్ తీగలు నేలకు ఆనడంతో ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భూంపల్లి గుట్ట నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు  ఉన్న విద్యుత్ స్తంభాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయ్ వాటిని సరిచేయాలని గ్రామస్తులు విద్యుత్ అధికారులను వేడుకుంటున్నారు.

అంతేకాకుండా కాలినడకన.బైకులపై నడుచుకుంటూ గ్రామానికి వెళ్తున్నామని స్థానికులు అంటున్నారు. ఇకనైనా విద్యుత్ అధికారులు స్పందించి కిందికి వంగిన విద్యుత్ స్తంభాలను సరిచేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని భూంపల్లి గ్రామ ప్రజలు కోరు తున్నారు. ప్రాణాలు పోతేనే పట్టించుకునే విద్యుత్ అధికారులు ఇకనైనా విద్యుత్ అధికారులు స్పందించి గ్రామంలో వంగి ఉన్న విద్యుత్ స్తంభాలను సరిచేయాలని విద్యుత్ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా గ్రామస్తుల కోరికలను విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వంగిపోయిన విద్యుత్ స్తంభాలను సరిచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.