నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): స్నానం చేస్తున్న బాలికపై విద్యుత్ మీటర్ రీడర్ అఘాయిత్యానికి యత్నించిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలోలకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డు ప్రాంతంలోని ఓ ఇంట్లో 13 ఏళ్ల మైనర్ బాలిక స్నానం చేసేందుకు ఇంటి ముందు ఉన్న బాత్రూంలోకి వెళ్లింది. అప్పుడే ఇంటి కరెంట్ బిల్లు తీసేందుకు విద్యుత్ రీడర్ వచ్చాడు. బాలిక స్నానం చేస్తున్న విషయం గమనించిన రీడర్ బాత్రూంలోకి వెళ్లాడు. బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించడంతో బాలిక కేకలు వేసింది. అక్కడే పనిలో ఉన్న తండ్రి గుర్తించి స్థానికులతో విద్యుత్ సిబ్బందిని బాత్రూం నుంచి బయటకు లాగి, దేహశుద్ది చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. నింధితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.