calender_icon.png 4 March, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా విద్యుత్ లైన్ మెన్ దినోత్సవ వేడుకలు

04-03-2025 06:41:50 PM

పిట్లం (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని సెక్షన్ ఆఫీసులో లైన్ మెన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎల్, ఏఎల్ఎం, ఎల్ఎం, ఎల్ఐ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి, స్వీట్లు పంచి సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏడిఈ అరవింద్ మాట్లాడుతూ... లైన్ మెన్ లు విధిని అత్యంత ప్రతిభావంతంగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. అలాగే, విధి నిర్వహణలో సేఫ్టీ జాగ్రత్తలను పాటించవలసిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ సురక్షిత మార్గదర్శకాలను అందజేశారు. లైన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రెడ్డి మరియు సెక్షన్ స్టాఫ్ మొత్తం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.