calender_icon.png 19 January, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ ఉద్యోగి సస్పెండ్

11-09-2024 02:58:49 AM

మెదక్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): మెదక్ జిల్లాకు చెందిన ఓ విద్యుత్ ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చీఫ్ ఇంజినీర్(రూరల్) పీ బిక్షపతి మంగళవారం ఆదేశాలు జారీ చేశా రు. శివ్వంపేట సెక్షన్ అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బీ దుర్గాప్రసాద్ ఒక పనికి సంబంధించి అంచనాలు తయారు చేసి వర్క్ ఆర్డర్ విడుదల చేయడానికి లం చం డిమాండ్ చేశాడన్న ఆరోపణతో సీఎండీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్ సెంటర్‌కు బాధితులు ఫోన్ చేసి ఫిర్యా దు చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేప ట్టగా ఆరోపణలు రుజువు కావడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు.