07-03-2025 12:00:00 AM
కామారెడ్డి, మార్చి 6,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో గురువారం రైతుల పొలంలో విద్యుత్ శాఖ - రైతు పొలంబాట కార్యక్రమం కామారెడ్డి డి ఈ టెక్నికల్ కళ్యాణ్ చక్రవర్తి, దోమకొండ ఏ డి ఈ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
విద్యుత్ శాఖ రైతులకు పొలం బాటలో భాగంగా ఉత్తర తెలంగాణ విద్యుత్ సంస్థ ఆపరేషన్ సర్కిల్ కామారెడ్డి ఆధ్వర్యంలో రైతులకు విద్యుత్ శాఖ రైతుల పొలం బాట కార్యక్రమాన్ని రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
వ్యవసాయ పొలాల వద్ద తీసుకోవాల్సిన విద్యుత్ భద్రత ప్రమాణాలు దృష్టిలో ఉంచుకొని వ్యవసాయాన్ని ఎలాంటి ప్రమాదం లేకుండా చేసుకోవాలని అవగాహన కల్పించారు. రైతుల జాగ్రత్తలపై సలహాలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో దోమకొండ, విద్యుత్ ఏ ఈ లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.