calender_icon.png 1 March, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ కాలుకు స్పందించిన విద్యుత్ శాఖ ఎస్ఈ

01-03-2025 06:14:20 PM

రైతుల మొరను ఆలకించి 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ వెంటనే మంజూరు..

ఎండిన పంటలకు చలించిన విద్యుత్ శాఖ ఎస్ఈ..

కామారెడ్డి జిల్లా మోషన్ పూర్ రైతుల హర్షం..

కామారెడ్డి (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పంట పండించుకునే రైతులకు రబి సీజన్ లో ట్రాన్స్ఫార్మర్ పలు మార్లు కాలిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించి ట్రాన్స్ఫార్మర్ స్థాయిని పెంచాలని రైతులు కోరిన పట్టించుకోలేదు. దీంతో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషన్ పూర్ రైతులు స్థానిక మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావును శనివారం సంప్రదించారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ట్రాన్స్ఫార్మర్ స్థాయిని 65 కేవి నుంచి 100 కేవి గా మార్చాలని స్థానిక విద్యుత్ శాఖ ఏఈ కి ఏడి ఈ కి వివరించిన ట్రాన్స్ఫార్మర్ స్థాయిని పెంచడం లేదని రైతులు తెలిపారు. దీంతో తరచుగా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుందని రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వివరించారు. 65 కే.వి స్థాయి ట్రాన్స్ఫార్మర్ స్థాయిని100 కెవి స్థాయికి పెంచాలని అధికారులకు మొరపెట్టుకున్న, స్పందించడం లేదని రైతులు వివరించారు.

చివరికి మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు విద్యుత్ శాఖ ఎస్ ఈ శ్రావణ్ కుమార్ కు  ఫోన్ కాల్ చేస్తే నాలుగు గంటల్లో100 కేవీ ట్రాన్స్ఫార్మర్ను అందించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం  మోషం పూర్ గ్రామం లో చోటు చేసుకుంది.దీంతో ఆ అధికారికి ఆ గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలిపారు.తమకు మీరే దేవుడని తమ కళ్ళముందే తమ పంటలు ఎండిపోతున్నాయని ఏం చేయలేకపోతున్నామన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషన్ పూర్ గ్రామంలో ఎస్ ఎస్- 3 ట్రాన్స్ఫార్మర్ గత ఏడాది నుంచి ఓవర్ లోడ్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ ట్రాన్స్ఫార్మర్ కింద 15 మంది రైతులు ఉండగా మోటార్లు చాలు చేస్తే ఫెస్ వైరు పోయి మరోపక్క ట్రాన్స్ఫార్మర్ పలుమార్లు కాలిపోయింది.దీంతో రైతులు 63 కె.వి ట్రాన్స్ఫార్మర్ నుంచి 100 కె.వి ట్రాన్స్ఫార్మర్ కు పెంచాలని గత ఏడాది నుంచి రైతులు మొరపెట్టుకున్న ఫలితం దక్కలేదు.

దీంతో గత్యంతరం లేక ఎండిన పొలంకర్రలతో సదాశివ నగర్ ఉమ్మడి మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు ను రైతులు కలిశారు. ఎలాగైనా తమకు ట్రాన్స్ఫార్మర్ ఇప్పించి పంటలను కాపాడాలని మొరపెట్టుకున్నారు.దీంతో ఆయన ముందుగా రామారెడ్డి ఏఈ తో మాట్లాడారు. అయినా ఫలితం దక్కకపోవడంతో డిఈతో మాట్లాడారు. రైతుల బాధ తీర్చకపోవడంతో శనివారం రైతులు మళ్లీ కామారెడ్డి లో ఉన్న మాజీ జెడ్పిటిసి ని కలిశారు. దీంతో ఆయన ట్రాన్స్కో ఎస్ ఈ శ్రావణ్ కుమార్ కు ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో ఎండిపోతున్న వరి పంట పొలాల ఫోటోలను కూడ ఫోన్లో చూపెట్టారు. దీంతో స్పందించిన ఎస్ఈ ఇలాంటి సమస్యను తమ దృష్టికి ఇప్పటివరకు ఎందుకు తీసుకురాలేదని అధికారులపై మండిపడి నాలుగు గంటల్లో ప్రభుత్వ వాహనంలో 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ను మోశంపూర్ కు పంపి రైతులను ఆదుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఎండిపోతున్న తమ పంటలను మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు ట్రాన్స్కో ఎస్ఈ శ్రావణ్ కుమార్ ప్రాణం పోశారని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతుల సమస్యలపై కిందిస్థాయి అధికారులు స్పందించి పనిచేస్తే ఇలాంటి ఇబ్బందులు రావని రైతులన్నారు. దీంతో వెంటనే ట్రాన్స్ఫార్మర్లు చూసిన రైతులు ఆనందాన్ని ఆపుకోలేక కామారెడ్డి లోని ట్రాన్స్కో ఎస్ ఈ కార్యాలయానికి మాజీ జెడ్పిటిసి ని తీసుకెళ్లి ఎస్ ఈ శ్రావణ్ కుమార్ కు శాలువాతో  సన్మానించి రైతులు కృతజ్ఞతలను తెలిపారు.