04-04-2025 01:28:41 AM
మహబూబాబాద్. ఏప్రిల్ 3: (విజయ కాంతి): ట్రాన్స్ఫార్మర్లకు నీళ్లు పట్టడం అను కుంటున్నారా.. ఇది అక్షర సత్యం.. మహబూ బాబాద్ జిల్లా కేసముద్రం బల్దియా పరిధిలో మండుతున్న ఎండలకు విద్యుత్ సరఫరా ట్రాన్స్ఫార్మర్లకు సరైన ఎర్త్ అందక విద్యుత్ సరఫరా లో హెచ్చుతగ్గులు జరిగి విద్యుత్ పరికరాలు దెబ్బతింటు న్నాయి.
దీనితో పట్టణ పరిధిలోని సుమా రు 60కి పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి ఆదేశాల మేరకు ఎర్త్ పైపు వద్ద ట్యాంకర్లతో నీళ్లు పట్టి తడుపు తున్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్త్ కు సరైన తేమ లేకపోతే విద్యుత్ సరఫరా నియంత్రణ ఉండదని, అలాగే సింగిల్ ఫేస్ విద్యుత్ సరఫరా ఉన్నచోట రిటర్న్ విద్యుత్ సరఫరా జరిగి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని, దీన్ని నివారించడానికి ప్రతి ట్రాన్స్ఫార్మర్ కు ఉన్న ఎర్త్ పైపు వద్ద నీళ్లు పోసి తడుపుతున్నట్టు చెప్పారు.