కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో విద్యుత్ శాఖల్లో భారీగా బదిలీలు జరిగాయి. రెండు సంవత్సరాలుగా ఒకే చోట విధులు నిర్వహించిన అధికారులను బదిలీ చేసినట్లు జిల్లా విద్యుత్ శాఖ సూపర్డెంట్ ఇంజనీర్ రమేష్ బాబు సోమవారం తెలిపారు. కామారెడ్డి జిల్లా దోమకొండ ఏడిఈగా ఉన్న కిరణ్ చైతన్య కామారెడ్డి కన్ స్ట్రక్షన్ ఏడీఈ బదిలీ, ఎల్లారెడ్డి ఏడిఈ సుదర్శన్ రెడ్డి దోమకొండకు బదిలీ, కామారెడ్డి కమర్షియల్ విభాగంలో ఏడిఈ మల్లేష్ లింగంపేటకు బదిలీ అయ్యారు. ఏఈలుగా ఉన్న బాలాజీ బాన్సువాడ ఏఈగా పనిచేసి బిక్కనూర్ నార్త్ కు, గోపికృష్ణ కామారెడ్డి టీఆర్ఈలో నుంచి మద్నూర్ ఏఈ గా బదిలీ అయ్యారు. సదాశివ నగర్ ఏఈగా పనిచేసిన ధర్మయ్య కామారెడ్డి కమర్షియల్ విభాగం కు బదిలీ అయ్యారు. ఎల్లారెడ్డి నుంచి తిరుపతిరెడ్డి మాచారెడ్డికి బదిలీ కాగా వెంకటేష్ కామారెడ్డి కమర్షియల్ విభాగం నుంచి కామారెడ్డి టు ఏఈగా బదిలీ అయ్యారు.
గాంధారిలో ఏఈ గా పనిచేసిన సతీష్ రెడ్డి కామారెడ్డి టెక్నికల్ విభాగానికి బదిలీ అయ్యారు. నాగిరెడ్డిపేటలో పనిచేసిన మనోరంజన్ కామారెడ్డి ఎం ఆర్ టి కి బదిలీ అయ్యారు. బి బి పేట ఏఈ గా పనిచేసిన దివ్య గాయత్రి బాన్సువాడకు బదిలీ అయ్యారు. కామారెడ్డి ఎం ఆర్ టి వి భాగంలో పనిచేసిన హనుమంతు రెడ్డి కామారెడ్డి టి ఆర్ ఈకి బదిలీ అయ్యారు. మాచారెడ్డి లో పనిచేసిన వెంకట రమణాచారి ఎల్లారెడ్డి కి బదిలీ అయ్యారు. దోమకొండలో పనిచేసిన ప్రదీప్ కుమార్ కామారెడ్డి హెచ్ టీ మీటర్స్ కు బదిలీ అయ్యారు. బాన్సువాడ లో పనిచేసిన నామ్ దేవ్ రాజంపేటకు బదిలీ అయ్యారు. కామారెడ్డి పట్టణ టు ఏఈగా పనిచేసిన జ్యోతి నాగిరెడ్డి పేటకు బదిలీ అయ్యారు. భిక్కనూర్ నార్త్ ఏఈగా పనిచేసిన రామలక్ష్మి కామారెడ్డి పట్టణ త్రి కి బదిలీ కామారెడ్డి 3 ఏఈగా పనిచేసిన లక్ష్మణ్ గాంధారికి బదిలీ అయ్యారు. మదుర్నూర్ ఏఈగా పనిచేసిన అరవింద్ బాన్సువాడకు బదిలీ అయినట్లు కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ అధికారి రమేష్ బాబు పేర్కొన్నారు.