calender_icon.png 21 February, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైం రికార్డ్

19-02-2025 10:46:08 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్(Electricity demand) ఆల్ టైం రికార్డు నమోదైంది. 16 వేల మెగావాట్ల మైలు రాయిని విద్యుత్ డిమాండ్ దాటింది. అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా సీఎండీలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరా పరిస్థితిపై భట్టి విక్రమార్క అధికారులతో చర్చించారు.

విద్యుత్ డిమాండ్ ను సమస్యలు లేకుండా దీటుగా ఎదుర్కొంటున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డిమాండ్ ఎంతగా పెరిగినా దానికి తగ్గట్టు విద్యుత్ సరఫరా(Power supply) చేస్తామని వెల్లడించారు. ఉదయం 7.55 గంటలకు 16,058 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు అయింది. ఈనెల 10న నమోదైన 15,998 మెగావాట్ల డిమాండును తెలంగాణ రాష్ట్రం(Telangana State) అధిగమించింది. గతేడాది మార్చి 8న అత్యధిక విద్యుత్ డిమాండ్ 15,623 మెగావాట్లు నమోదైందని విక్రమార్క వెల్లడించారు.