calender_icon.png 1 October, 2024 | 12:53 PM

ఖరీఫ్‌లోనూ రబీ స్థాయిలో విద్యుత్ డిమాండ్

01-10-2024 01:43:29 AM

సీజన్ ముగింపు నాటికి గరిష్ఠ డిమాండ్ 10వేల మెగావాట్లకు చేరే ఛాన్స్ 

ఓవర్ లోడ్ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

అధికారులతో సీఎండీ ముషారఫ్ ఫరూఖీ

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): రాష్ర్టవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని, అధికారు లు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ పేర్కొన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రబీ స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదవుతున్నట్లు చెప్పా రు.

సోమవారం సూపరింటెండింగ్ ఇంజినీర్లు, చీఫ్ ఇంజినీర్లతో సీఎండీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిసాగు అవుతుందని చెప్పారు. వరిసాగు వల్లే గత రబీ సీజన్‌లో నమోదైన స్థాయి లో ఈ ఖరీఫ్ సీజన్లో విద్యుత్ డిమాం డ్ పెరిగినట్లు చెప్పారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో గతేడాది ఖరీఫ్ సీజన్‌లో గరిష్ఠ డిమాండ్ 9,862 మెగావాట్లు కాగా, ఈసారి ఇప్పటి వరకు 9,910 మెగావాట్లకు చేరినట్లు వివరించారు.

ఈ సీజన్ ముగిసే నాటికి గరిష్ఠ డిమాండ్ 10,000 మెగావాట్లకు పైగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సీఎండీ అధికారులకు సూచించారు. వినియో గం 200 మిలియన్ యూనిట్లకు మించే అవకాశం ఉన్నట్లు వివరించా రు. రాష్ర్టంలో గతేడాది ఖరీఫ్ సీజన్‌లో అత్యధిక డిమాండ్ 15,370 మెగావాట్లు కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 20 నాటికి 15,570 మెగావా ట్లుగా నమోదైందని సీఎండీ అన్నారు.

అలాగే రాష్ర్ట అత్యధిక విద్యుత్ వినియోగం గతేడాది సెప్టెంబర్ 20 నాటి కి 292.51 మిలియన్ యూనిట్లు ఉం డగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 19 నాటికే 303.82 మిలియన్ యూనిట్లకు పెరిగినట్లు వివరించారు. రాష్ర్టంలో సరా సరి విద్యుత్ వినియోగం గతేడాది సెప్టెంబర్‌లో 228.42 మిలియన్ యూనిట్లు ఉంటే.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 234.75 మిలియన్ యూనిట్లకు చేరుకుందని వెల్లడించారు.

ఈ సీజన్ ముగిసే నాటికి డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై ఎలాంటి ఓవర్ లోడ్ సమస్యలు రాకుండా, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. రైతాంగానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.