10-02-2025 03:30:36 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 16 వేల మెగావాట్లకు చేరిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వేసవి, యాసంగి పంటల ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందన్నారు. గతేడాది మార్చిలో రికార్డుస్థాయిలో 15,623 మెగావాట్ల ఉన్న విద్యుత్ డిమాండ్ ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన 15,920 మెగావాట్లు నమోదైందని ఆయన వెల్లడించారు. డిమాండ్ వియోగం దృష్ట్యా రేపు విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించి వారి డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.