calender_icon.png 4 January, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ వినియోగదారులు సహకరించాలి

01-01-2025 05:59:20 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ విద్యుత్ సబ్ డివిజన్లో గురువారం విద్యుత్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాల అంతరాయం ఉంటుందని ఆపరేషన్ డిఇ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఖానాపూర్ డివిజన్ పరిధిలోని బీర్ నంది పాత ఎల్లాపూర్ పెంబి పరిధిలోని సబ్ స్టేషన్లలో విద్యుత్ మరమ్మత్తులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.