08-04-2025 05:02:16 PM
టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ వేణుగోపాల చారి..
చిట్యాల (విజయక్రాంతి): రేపు మండలంలో నిర్వహించే విద్యుత్ వినియోగదారుల సదస్సును వినియోగదారులందరు సద్వినియోగం చేసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ వేణుగోపాల చారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన మీటర్లు మార్చుట, లో వోల్టేజ్ హెచ్చుతగ్గులు, లోపాలు ఉన్న మీటర్లు మార్చడం వంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఉదయం 10 నుండి 1 గంట వరకు మండల కేంద్రంలోని రైతు వేదికలో సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.