13-02-2025 07:32:04 PM
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు..
పాల్వంచ (విజయక్రాంతి): తెలంగాణలో విద్యుత్ రంగంలో పనిచేస్తున్న 20 వేలమంది ఆర్టిజన్ కార్మికులని వెట్టిచాకిరీ నుండి విముక్తి చేసి రెగ్యులర్ ఉద్యోగులుగా పర్మినెంట్ చేసి కుటుంబాలలో వెలుగులు నింపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వంకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో గురువారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్స్ నూతన క్యాలెండర్ ను సాంబశివరావు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కేసీఆర్ హయాంలో ఆర్టిజన్ అనే పోస్ట్ ని క్రియేట్ చేసి 10 ఏళ్ల నుంచి శ్రమ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఒక పర్మినెంట్ ఉద్యిగికి ఇచ్చే వేతనంతో 10 మంది ఆర్టిజన్ కార్మికులుకు వేతనం చెల్లిస్తూ శ్రమ దోపిడీనీ చేస్తున్నాయని ఆరోపించారు.
20 వేల మంది తెలంగాణ మొత్తం 4 కోట్లు మందికి విద్యుత్ వెలుగులు అందిస్తున్నాయన్నారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరిటిజన్స్ కి ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ ఉద్యోగలుగా కన్వరేషన్ చేసి నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరిజన్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నరాటి ప్రసాద్, ఏఐటీయూసీ రాష్ట్ర సీనియర్ నాయకులు బి అయోధ్య, ఎస్.కె సాబీర్ పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ శంకర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం ఓదెలు, కోలా శ్యాం, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచెర్ల జమలయ్య, దేవరకొండ శంకర్, కే సారయ్య, బండి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.