calender_icon.png 24 February, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఛలో విద్యుత్ సౌధ’ను జయప్రదం చేయాలి

18-02-2025 12:00:00 AM

జిల్లా కన్వీనర్ మోత్కూరి కోటి

భూపాలపల్లి, ఫిబ్రవరి 17  ః ఈనెల 20వ తేదీన విద్యుత్ సౌధ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని  టీవీఎసి జేఏసీ జిల్లా కన్వీనర్ మోత్కూ రి కోటి అన్నారు. ఈ మేరకు సోమవా రం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోత్కూరి కోటి మాట్లాడుతూ విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ చేయాలని విద్యారతను బట్టి  ఐటిఐ చేసిన వారికి జేఎల్‌ఎం, డిగ్రీ చేసిన వారికి జూనియర్ అసిస్టెంట్ ,టెన్త్ క్లాస్ చదివిన వారికి ఆఫీస్ సబార్డినేట్ డిప్లమో చేసిన వారికి సబ్ ఇంజనీర్, ఇవ్వాలని డిమాండ్ చేశా రు. గతంలో ఎన్నికల ముందు ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు.  కార్మికులకు ప్రభుత్వ ఏర్పాటు తర్వాత వెంటనే కన్వర్షన్ చేస్తామని  హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాదయాత్రలో సందర్భంగా ఆర్టిజన్  కార్మికుల సమస్యలపై వినతి పత్రం  ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.ఆర్టిజన్ కన్వర్షన్ సాధనలో భాగంగా ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఆఫీసుల వద్ద ధర్నా చేయడం జరిగిందని తెలిపారు.ఈనెల 20వ తేదీన  చలో విద్యుత్ సౌధ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ట్రాన్స్కో జెన్కో  సిఎండి కి వేలాది మందితో మెమోరాండం ఇవ్వడం జరుగుతుందన్నారు.తక్షణమే ప్రభుత్వం, మేనేజ్మెంట్ స్పందించి చర్చలకు పిలిచి ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్  చేశారు.ఈ కార్యక్రమంలో ఎండి అంకుషావాలి,సురేందర్ రెడ్డి, మచ్చిక వెంకటేశ్వర్లు ,బత్తుల రాజేందర్, జేఎల్‌ఎం  శ్యామ్ ,వేణు , అన్ మ్యాన్ శ్రీనివాస్, రంజిత్, దేవేందర్ , రైతు సంఘం నాయకులు బిక్షపతి ,రాజేందర్ ,సమ్మయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.