calender_icon.png 4 March, 2025 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ...

27-01-2025 04:42:12 PM

లక్కీ ఇండస్ట్రీ పరిశ్రమ వ్యాపారి వద్ద రూ.20 వేల లంచం తీసుకుంటు రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డ విద్యుత్ ఏఈ కృష్ణ.

మనోహరబాద్ (విజయక్రాంతి): లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కాళ్లకల్ విద్యుత్ శాఖ ఏఈ కృష్ణ. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ విద్యత్ శాఖ సెక్షన్ ఏఈ కృష్ణ కాళ్లకల్ గ్రామంలో లక్కీ ఇండస్ట్రీ లో ట్రాన్స్ఫార్మార్ కనెక్షన్ ఇవ్వడం కోసం రు 50 వేలు లంచం అడగగా 30 వేలకు ఒప్పందం కుదర్చుకున్నారు. దీంతో గత 18న రూ.10 వేలు ఇవ్వగా సోమవారం రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఉమ్మడి మెదక్ జిల్లా ఏసిబి డిఎస్పీ సుదర్శన్ తమ సిబ్బంది మెదక్ రేంజ్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేష్ లతో కలిసి రెడ్ హ్యాండ్ డెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ శాఖ లో  ఏఈ ని అదులో తీసుకొని  సోదలు నిర్వస్తున్నామని అన్నారు.