calender_icon.png 24 October, 2024 | 12:53 AM

ఎలక్ట్రిషియన్లు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

23-10-2024 10:09:07 PM

తెలంగాణ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్క యాదగిరి

ఎల్బీనగర్,(విజయక్రాంతి): ఎలక్ట్రిషియన్ కు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నక్క యాదగిరి అన్నారు. బుధవారం పాలీ క్యాబ్ కంపెనీ ఆధ్వర్యంలో నాగోలు అల్కాపురి పురిలోని ఓ బంక్విట్ హల్ ఎలక్ట్రిషియన్ కు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న నక్క యాదగిరి మాట్లాడుతూ ఎలక్ట్రికల్ పనిచేసే సమయంలో విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా వృత్తి లో మెలకువలు నేర్పించారు. విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తడంతో మరమ్మతులు చేసేందుకు కరెంట్ స్తంభంలు ఎక్కిన వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా పాలీ క్యాబ్ కంపెనీ తరుపున ఎలక్ట్రిషియన్ కు 2లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ చేయడం అభినందనీయం అని తెలంగాణ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్యక్షులు నక్క యాదగిరి అన్నారు. గత మూడు రోజులుగా అనేక మంది ఎలక్ట్రిషన్స్ శిక్షణ తరగతులు నిర్వహించారు. పోలీక్యాబ్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోనార్క్ రావల్, కంపెనీ ప్రతినిది సుమన్ మాట్లాడుతూ ఇండియా లో పోలీ క్యాబ్ బెస్ట్ క్వాలిటీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు విక్రయాలు చేస్తుందని. మరే కంపెనీ కూడా పోటీలో లేదని అన్నారు పోలికాజ్ ఎలక్ట్రిషన్స్ అన్ని వేళలా అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు ప్రమోద్ జగన్నాథ్ వెంకట్, తెలంగాణ ఎలక్ట్రిషన్ అసోసియేషన్ ప్రతినిదులు ఎన్.బెనర్జీ. ఆర్ శ్రీనివాస్. పి గోవర్ధన్, శ్రీకాంత్ రెడ్డి, గోలి గిరి తదితరులు పాల్గొన్నారు.