10-02-2025 08:48:03 AM
భారీగా ఆస్తి నష్టం..
సంగారెడ్డి, (విజయక్రాంతి): జహీరాబాద్ పట్టణంలోని శంకర్ ఎలక్ట్రికల్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్గి ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ జరిగి ఎలక్ట్రికల్ షాప్ కాలిపోయింది. షాప్ లో ఉన్న విలువైన వస్తువులు అగ్గి బూడిదైనాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగిందని పలువురు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన విషయాన్ని ప్రజలు గమనించి యజమానికి సమాచారం ఇవ్వడంతో యజమాని అక్కడికి రావడం జరిగింది. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలు వారిపై ప్రయత్నం చేశారు. ఆస్తి నష్టం ఎంత జరిగిందో తెలియవలసి ఉంది.