calender_icon.png 19 April, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

12-04-2025 12:00:00 AM

బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి 

ఎల్బీనగర్, ఏప్రిల్ 11 : బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను కార్పొరేటర్ లచ్చిరెడ్డి కోరారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని మైల్ స్టోన్ కాలనీలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని, లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తుందని, నూతన ట్రా న్స్ఫార్మర్ ఏర్పాటు చేయించాలని కాలనీవాసులు కోరారు. ఈ మేరకు శుక్రవారం కాలనీ వాసులతో కలిసి విద్యుత్ శాఖ అధికారి ఏడీ రామచంద్రయ్యతో మాట్లాడి, కొత్త గా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెం ట్ వెంకటేశ్, ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, ట్రెజరర్ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సునీల్, బాబు, పంచజాను, ఓం ప్రకాశ్, అన్నపూర్ణ, వైష్ణవి, స్వప్న, సరిత, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సభ్యుడు నర్సింహారెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, బీజేవైఎం సెక్రటరీ సురేష్ కుమార్ పాల్గొన్నారు.

జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్‌ను సద్వినియోగం చేసుకోవాలి 

బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని సచివాలయ నగర్ ఉన్న జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి పరిశీలించారు. వేసవికాలంలో  సిమ్మింగ్ పూల్ ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచిం చారు. సిమ్మింగ్‌కి వచ్చే వాళ్లకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్విమ్మింగ్ పూల్  సిబ్బందికి సూచించారు.