calender_icon.png 24 October, 2024 | 9:35 AM

ఏసీబీ వలలో విద్యుత్ అధికారి

24-10-2024 01:36:45 AM

  1. దొంగ కరెంట్ వాడుతున్నారని బాధితుడికి బెదిరింపు
  2. రూ.26 వేలు లంచం తీసుకొంటూ దొరికిన లైన్ ఇన్స్‌పెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 23 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని టీజీ ఎన్పీడీసీఎల్ లైన్ ఇన్సెపెక్టర్ నాగరాజు రూ.26 వేలు లంచం తీసు కొంటు బుధవారం ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రమేశ్ వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని కరకవాగు ప్రాంతంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు.

నిర్మాణానికి అవసరమైన విద్యుత్‌ను తన మేనమామ ఇంటి నుంచి వాడుకంటున్నాడు. ఈ విష యం తెలుసుకొన్న నాగరాజు దొంగ కరెం టు వాడుతున్నారంటూ, కేసు నమోదు చేస్తానంటూ బెదిరించాడు. కేసు నమోదు కాకుండా చేయడానికి రూ. 68 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అంత ఇవ్వలేమని ఇంటి యజమాని చెప్పడంతో మొదట రూ. 30 వేలు, ఆ తర్వాత రూ.26 వేలకు అంగీకారం కుదిరింది. అనంతరం బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో బుధవారం నాగరాజుకు రూ.26 వేలు ఇస్తుండ గా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు.

నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా లంచం డిమాండ్ చేసిన మాట, తీసుకున్న మాట వాస్తమని అంగీకరించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడి నుంచి రూ.26 వేలు స్వాధీనం చేసుకొన్నామని వివరించారు. 

బదిలీపై వచ్చిన వారం రోజుల్లోనే ఏసీబీ వలకు

ఏసీబీకి చిక్కిన లైన్‌ఇన్స్‌పెక్టర్ జినుగు నాగరాజు అన్నపురెడ్డిపల్లి నుంచి బదిలీపై పాల్వంచకు వచ్చి వారం రోజులు పూర్తికాలేదు. అప్పుడే ఏసీబీకి చిక్కాడు. 2021-22 ప్రాంతంలో పాల్వంచలో పనిచేస్తున్న రోజు ల్లో నవభారత్ వద్ద రాత్రికిరాత్రే విద్యుత్‌శాఖ అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాన్ని మార్చిన కేసులో నాగరాజును అప్పటి అధికారులు అన్నపురెడ్డిపల్లికి బదిలీ చేశారు.

అప్పట్లో నాగరాజుపై విద్యుత్‌శాఖ విజిలెన్స్ కు అనేక ఫిర్యాదులు అందడంతో అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకొన్నారు. తిరిగి ఇటీవల జరిగిన జనరల్ బదిలీల్లో  విద్యుత్‌శాఖకు చెందిన డీఈ, ఎమ్మెల్యే, ఎంపీల రికమండేషన్‌తో అధికారులపై ఒత్తిడి తెచ్చి పాల్వంచకు బదిలీపై వచ్చినట్టు తెలుస్తోంది.