12-03-2025 12:56:21 AM
జిల్లా విద్యుత్ ఎస్‌ఈ శ్రీనివాస చారి
కల్లూరు, మార్చి 11(విజయక్రాంతి ): వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ముమ్మరంగా విద్యుత్ లైన్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఇ శ్రీనివాస చారి పేర్కొన్నారు. మండలంలోని లోకారం గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం సందర్బంగా అయన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయి దయానంద్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా ఎస్ ఇ మాట్లాడుతూ సింగిల్ ఫేజ్ లైన్లను త్రీ ఫేజ్ లైన్ల గా మార్పు చేయుట, లో వోల్టేజి సమస్యను అధిగమించుటకు విద్యుత్ నియంత్రికల సామర్ధ్యం పెంపు, కొత్త విద్యుత్ నియంత్రికల ఏర్పాటు చేయటం వంటి పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు. కల్లూరు పట్టణంలో కొత్తగా 100 కె.వి.సామర్ధ్యం ఉన్న త్రీ ఫేజ్ విద్యుత్ నియంత్రికలు 10 ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. 1 ఫేజు నుండి 3 ఫేజు లైన్ల గా 10 కిలో మీటర్లు మేర మార్చటం జరిగిందని తెలిపా రు. ఈ కార్యక్రమంలో కల్లూరు విద్యుత్ శాఖ ఏ.ఇ. పి. వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు.