calender_icon.png 16 January, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలక్ట్రిక్ వాహన విక్రయాల జోరు

07-08-2024 12:37:33 AM

జూలైలో 55% పెరుగుదల

ముంబై, ఆగస్టు 6: దేశంలో ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు జోరుగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూలై నెలలో గత ఏడాది ఇదేనెలతో పోలి స్తే 55.2 శాతం వృద్ధిచెంది 1,79,038 యూనిట్లకు పెరిగినట్టు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఫెడా తెలిపింది. 2023 జూలైలో 1,16,221 ఈవీలు విక్రయమయ్యాయి. ఈ ఏడాది జూలైలో ప్రత్యేకించి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు జోరుగా సాగాయని, ఇవి 96 శాతం వృద్ధితో 1,07,016 యూనిట్లకు పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహన అమ్మకాలు 18 శాతం వృద్ధితో 63,667 యూనిట్లకు పెరిగాయని తెలిపింది. పాసింజర్ వాహన విక్రయాలు మాత్రం 2.92 శాతం తగ్గి 7,541 యూనిట్ల వద్ద నిలిచాయని తెలిపింది.