calender_icon.png 18 January, 2025 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుకాణం సర్దుతుండగా విద్యుదాఘాతం

27-08-2024 12:30:46 AM

భార్య మృతి

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 26 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దంపతులు విద్యుదాఘాతానికి గురవ్వగా భార్య మృతిచెందింది.  జిల్లాలోని పినపాక మండలంలోని పాండురంగాపురం గ్రామానికి చెందిన దంపతులు సర్వేస్, సమ్మక్క.. గ్రామంలో చిన్న దుకాణం పెట్టుకొని జీవిస్తున్నారు. సోమవారం ఉదయం దుకాణంలో సామన్లు సర్దుతున్న క్రమంలో ఇద్దరూ విద్యుత్‌ఘాతానికి గురై సృహతప్పి పడిపోయారు. స్థానికుల సమాచారం మేరకు బంధువులు వారిని మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సమ్మక్క అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త సర్వేస్‌కు చికిత్స చేస్తున్నారు. కాగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.