calender_icon.png 20 January, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరమ్మతులు చేస్తుండగా కరెంట్ షాక్

13-07-2024 04:53:10 AM

విద్యుత్ స్తంభంపైనే ప్రాణాలు వదిలిన కార్మికుడు

జనగామ, జూలై 12 (విజయక్రాంతి): విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తూ, విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన జనగామ జిల్లా లింగాల ఘణ పురం మండలం వనపర్తిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామా నికి చెందిన కుక్కల మల్లేశ్ (40) ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిం చుకుంటున్నాడు. కొన్నాళ్ల నుంచి లింగాలఘణపురం సబ్ స్టేషన్‌లో హెల్పర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, లైన్‌ను సరిచేసేందుకు మల్లేశ్ కరెంట్ పోల్ ఎక్కాడు.

విద్యుత్ అధికారులు ఆ సమయంలో ఎల్సీ ఇవ్వడం మరచిపోవడంతో మల్లేశ్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. పోల్‌పైనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న విద్యుత్‌శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే మల్లేశ్ మృతిచెందాడని మృ తుడు కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. అధికారులపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న జనగామ రూరల్ సీఐ మల్లేశ్‌యాదవ్ ఆందోళనకారులను నిలువరిం చారు. మల్లేశ్ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.