calender_icon.png 7 February, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్ షాక్

07-02-2025 01:41:45 AM

ఫిబ్రవరి మొదటి వారంలోనే రికార్డుస్థాయిలో విద్యుత్ డిమాండ్

15,752 మెగావాట్లు!

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి) : రాష్ట్ర చరిత్రలో అత్యధిక విద్యుత్తు డిమాండ్ 15,752 మెగావాట్లు నమోదయ్యింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన ప్పటి నుంచి ఇదే అత్యధికం. అయితే ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈసారి ఆ రికార్డులన్నీంటినీ చెరిపేస్తూ కొత్త రికార్డు 15,752 మెగావాట్లుగా గురువారం (6.2.2025) నాడు నమోదవ్వడం గమనార్హం.

ఇంతకు ముందు అత్యధిక విద్యు త్తు డిమాండ్ రికార్డు 15,623 మెగావాట్లు 8.3.2024 నాడు నమోద య్యింది. గడిచిన పద్నాలుగు నెలలుగా ప్రభుత్వం (విద్యుత్తు శాఖ) తీసుకుంటున్న చర్యలతో గృహ, వాణిజ్య, వ్యవ సాయ, పారిశ్రామిక రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తున్నామని సీఎండీ కృష్ణభాస్కర్ తెలిపారు.

గడిచిన రెండు నెలల్లో.. (డిసెంబర్ 20224, జనవరి 2025) నమోదైన విద్యుత్తు డిమాం డ్‌ను ఏడాది క్రితంనాటి గణాంకాలతో పోల్చితే గణనీయమైన డిమాండ్ నెలకొందని తెలిపారు. 2023 డిసెంబర్‌లో 12,666 మెగావాట్ల గరిష్ట డిమాండ్ రాగా.. సగటున రోజుకు 207.68 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగించా మన్నారు.

అదే 2024 డిసెంబర్‌లో 14,375 మెగావాట్లు (13.49 శాతం ఎక్కువ), సగటున 235.25 మిలియన్ యూనిట్లు (13.28 శాతం ఎక్కువ) వినియోగించామని సీఎండీ తెలిపారు. అలాగే ఈ జనవరిలో నమోదైన డిమాం  డ్, వినియోగంలోనూ వరుసగా 10.10 శాతం, 7.17 శాతం ఎక్కువ నమోదైనట్టు గా తెలిపారు.

రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని 17,000 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌నుకూడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా డిస్కంలు అన్ని రకాల చర్యలు తీసుకున్నాయని, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల ద్వారా, ఎక్చేంజీల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.

రూ. వేయి కోట్లు ఆదా..

థర్మల్  కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఖర్చు కన్నా.. బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసే విద్యుత్తు చవగ్గా దొరుకుతుందని.. అందువల్ల గడిచిన 13 నెలల్లో రూ. వేయి కోట్లు ఆదా చేయగలిగామని సీఎండీ వివరించారు. లాంగ్‌టర్మ్ అగ్రిమెంట్లన్నీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయిస్తుందని.. ఈ నేపథ్యంలో విద్యుత్తు తగినంత సరిపోకపోతే పవర్ ఎక్చేంజీలో కొనుగోలు చేస్తామని తెలిపారు.

డిస్కంలు తాత్కాలిక కొరతను పూడ్చడానికి పవర్  ఎక్చేంజీల నుంచి కొనుగోలు చేస్తాయని, తద్వారా ధరకూడా తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ కొనుగోలు ఆ రాష్ట్రం లో అందుబాటులో ఉన్న విద్యుత్తుపై ఆధారపడి ఉంటుందన్నారు. థర్మల్ విద్యుత్తు కేంద్రాలను బ్యాక్‌డౌన్ చేసినప్పుడు అయ్యే స్థిరధరలతో పోల్చితే.. పవర్ ఎక్చేంజీల్లో కొనుగోలు ధర తక్కువగా ఉంటే సంస్థలకు ఆదా జరుగు తుందని తెలిపారు.

డిసెంబర్, జనవరి నెలల్లో ఇదే జరిగిందని ఉదాహరణగా వివరించారు. డిసెంబర్ ఎక్చేంజీలో కొనుగోలు చేసిన విద్యుత్తు సగటున యూనిట్‌కు రూ. 2.69 పైసలకు, అలాగే జనవరి సగటున యూనిట్ రూ. 2.82 పైసలకు లభించిందన్నారు. రెండు నెలల్లో విద్యుత్తు కేంద్రాలను బ్యాకింగ్‌డౌన్ చేయడం ద్వారా రూ. 3.97 పైసలు, రూ. 4.18 పైసల కంటే తక్కువ ధరకే ఎక్చేంజీలో కొనుగోలు చేశామన్నారు.

దీనివల్ల డిసెంబరులో రూ. 196.68 కోట్లు, జనవరిలో రూ. 185.27 కోట్లను ఆదా చేయగలిగామని సీఎండీ వివరించారు. ఇలా 2023 డిసెంబరు నుంచి 2025 జనవరి వరకు రూ. 982.66 కోట్లు ఆదా చేయగలిగామని  పేర్కొన్నారు.