calender_icon.png 4 March, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదపు అంచున విద్యుత్ స్తంభం..

03-03-2025 05:29:27 PM

పట్టించుకోని అధికారులు..

భయాందోళనకు గురైతున్న ప్రయాణికులు..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందర ప్రధాన రోడ్డులో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉంది. నిత్యం తాహసిల్దార్ కార్యాలయంతో పాటు గడికోట, ప్రధాన ఆలయాలకు వెళ్లే దారిలో ఒక విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ అధికారులు విషయం తెలిసిన విద్యుత్ స్తంభాన్ని తొలగించడంలో విఫలమయ్యారు. ప్రతిరోజు వందలాదిమంది ప్రయాణికులు ఇదే దారిలో ప్రయాణిస్తున్న ప్రమాదం అని తెలిసిన అదికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ స్తంభం తుప్పు పట్టి ఉన్న విద్యుత్ స్తంభంను చూసి ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడు ఈ విద్యుత్ స్తంభం కూలుతుందో, ఎవరిపై పడుతుందో అని ప్రయాణికులు అటుగా చూసిన వారికి గుండె నిబ్బరంతో ప్రయాణం చేస్తున్నారు. 

తహాసిల్దార్ కార్యాలయం ముందు ప్రమాదపు అంచున విద్యుత్ ఇనుప స్తంభం ఏ సెకనులో విరిగి పడుతుందో అని భయాందోళనలో వాహనదారులు, గ్రామాల ప్రజలు, ప్రతిరోజు చూస్తూనే నిర్లక్ష్యంతో పట్టించుకోకుండా కాలయాపన చేస్తూన్న అధికారులు. వేసవికాలం కావడంతో వడగాల్పులు, వడగళ్ల వర్షాలు పడిన విద్యుత్ స్తంభం విరిగిపోయే ప్రమాదం ఉందని ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదం పొంచి ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి వెంటనే మరమ్మత్తులు చేయాలని వాహనదారులు, గ్రామాల ప్రజలు కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల ఇప్పటికైనా మొద్దు నిద్రను వీడి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికైనా స్పందిస్తారో లేదో విద్యుత్ శాఖ అధికారులకు తెలియాలి.