calender_icon.png 30 November, 2024 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌కు ఎలక్ట్రిక్ బస్సులు

13-08-2024 03:29:57 AM

  1. రీజియన్‌కు 70 బస్సులు కేటాయింపు
  2. ఇప్పటికే డిపోకు చేరకున్న 33 బస్సులు  
  3. తొలుత కరీంనగర్ నుంచి జేబీఎస్‌కు.. 
  4. ప్రైవేట్‌పరం అవుతుందని కార్మికుల ఆందోళన
  5. అదేమీ లేదంటున్న ఆర్టీసీ అధికారులు

కరీంనగర్, ఆగస్టు 12 (విజయక్రాంతి): నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రాజెక్టు కింద టీజీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను నడిపేందుకు నిర్ణయించింది. ఆగస్టు 15 తర్వాత కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ జేబీఎస్‌కు తొలి విడతగా ఈ బస్సు సేవలను ప్రారంభించాలని నిర్ణయించారు. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోలకు 70 బస్సులు మంజూరు చేశారు. మొదటి విడతగా 33 బస్సులు కరీంనగర్ రెండవ డిపోకు చేరుకున్నాయి. ఈ 33 బస్సులను కరీంనగర్ నుంచి హైదరాబాద్ జేబీఎస్ వరకు నడపనున్నారు. అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను ఆర్టీసీ నడుపనుంది. కిలోమీటర్‌కు రూ.39 ఆర్టీసీ చెల్లించాల్సి ఉంటుంది.

ఈ బస్సు డ్రైవర్లను కా్రంటాక్టు దక్కించుకున్న జేబీఎం సంస్థ నియమిస్తుంది. కండక్టర్లను ఆర్టీసీ సమకూరుస్తుంది. ఈ బస్సులకు చార్జింగ్ పెట్టేందుకు ఆయా డిపోల వద్ద ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్ల ఖర్చులు ఆర్టీసే భరించింది. 8 కోట్ల మేర ఇందుకు ఖర్చు చేసింది. మొదటగా సెమి లగ్జరి బస్సులను నడపనున్నారు. కరీంనగర్‌కు చేరుకున్న 33 బస్సులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అలాగే, చార్జింగ్ పాయింట్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరీంనగర్ రీజియన్‌కు వచ్చిన 33 బస్సులను రెండో డిపోకు కేటాయించారు. ఒకటో డిపో కు కేటాయించిన ఆరు బస్సులు రావాల్సి ఉంది.

కరీంనగర్ గోదావరిఖనికి 9, కరీంనగర్ మంథనికి నాలుగు, కరీంనగర్ కామారెడ్డికి ఆరు, కరీ ంనగర్ 6, కరీంనగర్ సిరిసిల్లకు 6 నాన్‌స్టాప్ బస్సులను నడుపనున్నారు. ఈ బస్సులు త్వరలో రానున్నాయి. జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించి ఈ బస్సులను ప్రారంభించే యోచనలో ఉన్నారు. 

ప్రైవేట్‌పరం అవుతుందని ఆందోళన

ఎలక్ట్రికల్ బస్సుల రాక ద్వారా ఆర్టీసీ ప్రైవేటీకరణ అవుతుందన్న ఆందోళన కార్మికుల్లో నెలకొంది. ప్రస్తుతం కరీంనగర్ రెండో డిపోలో 360 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ డిపో పరిధిలో 53 స్వంత బస్సులు, 52 అద్దె బస్సులు ఉన్నా యి. ఎలక్ట్రిక్ బస్సుల రాక ద్వారా ఈ డిపో లో ఉన్న స్వంత బస్సులను వన్ డిపోకు మార్చి ఈ డిపో మొత్తాన్ని ప్రైవేటీకరిస్తారన్న ఆందోళన కార్మికుల్లో నెలకొంది.

కండక్టర్ మినహా ఇతర సిబ్బందిని వేరేచోట్లకు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీలో కార్మి క సంఘాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో డిపోను కాపాడుకునేందుకు ఉద్యోగులు ఆందోళనలు ప్రారంభించేందుకు వెనకాడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సంస్థ ప్రైవేట్ దిశగా పయనిస్తే ఆందోళనలు తప్పవని కార్మిక సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. 

ప్రైవేటీకరణ కాదు.. అద్దె ప్రాతిపదికనే 

ఎలక్ట్రికల్ బస్సుల రాక ద్వారా డిపోను ప్రైవేటీకరిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదు. అద్దె ప్రాతి పదికన ఈ బస్సులను నడుపుతాం. త్వరలో 33 సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ 33 బస్సులు కరీంనగర్ రూట్‌లో అద్దె ప్రాతిపదికన (జీసీసీ కాస్ట్ కాంట్రాక్టు) నడుపబడుతాయి. వీటి పర్యవేక్షణ, ఆపరే షన్స్ మొత్తం ఆర్టీసీయే చూసుకుంటుంది. ప్రస్తుతం వీటికి సంబంధిం చిన అవసరమైన మౌళిక వసతుల ఏర్పాట్లలో భాగంగా ఎలక్ట్రికల్ పనులు కొనసాగుతున్నాయి. మౌలిక వసతుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత అతి త్వరలో ఈ ఎలక్ట్రికల్ సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభిస్తాం. 

 ఎస్ సుచరిత, కరీంనగర్ రీజనల్ మేనేజర్