calender_icon.png 16 January, 2025 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీ బ్యాటరీలతో ఎలక్ట్రిక్ సైకిల్స్

30-07-2024 02:01:26 AM

ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ 

చెన్నై: దేశంలోనే తొలిసారి ఈవీ బ్యాటరీల సాయంతో తయారు చేసిన ఎలక్ట్రిక్ మోటారు సైకిల్‌ను వచ్చే ఏడాది మార్కెట్‌లోకి తీసుకువస్తామని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్  సోమవారం ప్రకటించింది. ఓలా ఐపీఓ ప్రకటనపై  బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో కలిసి జరిగిన ఓ సమావేశంలో సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ ఈ విషయం వెల్లడించారు. 20౨5 తొలి ఆరు నెలల్లోనే తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తామని తెలిపారు. ఆగస్టు 15న జరిగే ఈ వెంట్‌లో మోటారు సైకిళ్ల మోడల్స్, ఇతర వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. తాము సొంతంగా తయారు చేసే ఈవీ బ్యాటరీల సాయంతో ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్లను అభివృద్ధి చేస్తామని మీడియాకు చెప్పారు. వచ్చే ఏడాదినుంచి తమ సంస్థలో తయారు చేసే బ్యాటరీలను మాత్రమే ఈవీ స్కూటర్లు, ఈవీ మోటారు సైకిళ్లలో వినియోగిస్తామని తెలిపారు. 

ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా అవకాశాలున్నాయనిచెప్పారు. గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాలకు భారత్‌ను కేంద్రంగా చేయాలన్నదే తమ అభిమతమని కూడా అగర్వాల్ చెప్పారు.

లీగల్ నోటీసు

ఇదిలా ఉండగా ఓలా  వాహనాల్లో మ్యాప్ మై ఇండియా తరహా మ్యాప్‌లను ఉపయోగిస్తున్నారంటూ  ఓలా ఎలక్ట్రిక్‌కు ఆ కంపెనీ లీగల్ నోటీసులు జారీ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ లైసెన్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆ నోటీసులో ఆరోపించింది. మరికొన్ని రోజుల్లో ఓలా ఐపీఓ రానున్న నేపథ్యంలో ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.