ముషీరాబాద్, జనవరి 17: బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయఅధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ మేధావుల సదస్సులో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ..
వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేశారు మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఏఐసీసీ ఓబీసీ ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.