calender_icon.png 12 January, 2025 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లు పెంచాకే ఎన్నికలు నిర్వహించాలి

30-12-2024 03:08:30 AM

ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, డిసెంబర్ 29 : బీసీ రిజర్వేషన్‌లను 42 శాతానికి పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు ఆదివారం కాచిగూడలోని ఓ హోటల్‌లో  బీసీ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ముదిరాజ్ అధ్యక్షన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరగింది.

కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగ రిజర్వేషన్‌లలో ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్‌లను కల్పించాలని అన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.