ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, డిసెంబర్ 23: (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాచిగూడలో సోమవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు. కులగణన చేసిన తర్వాత రిజర్వే షన్లు పెంచితే చట్టపరమైన అవరో ధాలు ఉండవని తెలిపారు. సమావేశంలో బీసీ సంఘం నాయకులు మిర్యాల యాదగిరి, నీలం వెంకటేశ్ పాల్గొన్నారు.