- హామీల అమలుకు 3న ఇందిరా పార్కు వద్ద సభ
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- 40కిపైగా బీసీ కుల సంఘాల నేతలతో భేటీ
హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుండా ఎన్నికలకు వెళ్తే అడ్డుకుంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మేరకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్య మాలు చేపడుతామని స్పష్టం చేశారు.
హామీ ల అమలు కోసం జనవరి 3న ఇందిరా పార్కు వద్ద భారీ సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో 40కిపైగా బీసీ కుల సంఘా ల నాయకులతో కవిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు నిర్వహిండానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని, బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించవద్దని తేల్చి చెప్పారు.
మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తామని స్పష్టంచేశారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాక, బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలపై ఆలోచన చేయాలని సూచించారు. రానున్న జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీసీలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతామని హెచ్చరిం చారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, జనవరి 3న సినిమా చూపిస్తామని చెప్పారు. సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. బీసీల సంక్షేమం కోసం బీఆర్ ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంపై ఆగ్ర హం వ్యక్తంచేశారు.
సమావేశంలో వివిధ కులసంఘాల నాయకులు లోడంగి గోవర్ధన్ యాదవ్, బొల్లా శివశంకర్, సుమిత్ర ఆనం ద్, మఠం భిక్షపతి, అనంతుల ప్రశాంత్ , పెంట రాజేశ్, ఆలకుంట హరి, ఆర్వి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.