calender_icon.png 27 December, 2024 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ప్రత్యక్ష’ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి

05-11-2024 01:22:22 AM

సెక్రటరియేట్ ఉద్యోగులు

హైదరాబాద్, నవంబర్ 4 (విజయ క్రాంతి): తెలంగాణ సచివాలయ సంఘానికి (టీఎస్‌ఏ) ప్రత్యక్ష పద్ధతి లో ఎన్నికలు నిర్వహించాలని సెక్రటరియేట్ ఉద్యోగులు నిర్ణయించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయ సంఘం భవనంలో సోమవా రం టీఎస్‌ఏ అధ్యక్షుడు మాధవరం సురేందర్ రావు అధ్యక్షతన నిర్వహించిన సెక్రటరియేట్ ఉద్యోగుల ఎల్డర్స్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించా రు.

ఈ సందర్భంగా  సురేందర్‌రావు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం సంఘం కృషి చేస్తుందన్నా రు. త్వరలో ప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించి కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో సీనయిర్ అధికారులు శంకర్, ప్రసాద్, సురేశ్‌కు మార్, రామ్‌సింగ్, రామస్వామి, నరేంద్రకుమార్, స్వామి, సుజాత, అంజన్‌కుమార్ పాల్గొన్నారు.