కార్పొరేషన్ పేరుతో కాలయాపన సరైంది కాదు
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్...
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని బహుజన్ సమాజ్ పార్టీ(Bahujan samaj party) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే పాల్వంచ మున్సిపల్ ఎన్నికలు జరిపిస్తాని హామీ ఇచ్చారని, గెలిచి సంవత్సరం గడిచినా ఎన్నికలు నిర్వహించకుండా కార్పొరేషన్ చేస్తామంటూ కాలయాపన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికలతో పాటు పాల్వంచ మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
గ్రేట్ 2 మున్సిపాలిటీగా ఉన్నా ఎన్నికలు నిర్వహించకపోకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. పక్కనే ఉన్న కొత్తగూడెం మున్సిపాలిటీలో వేరే పార్టీ నాయకులను ప్రజా ప్రతినిధులను కౌన్సిలర్ టిక్కెట్లు ఇస్తామని పార్టీలో చేర్చుకుంటూ మరోపక్క కార్పొరేషన్ అనడం ఎవరిని మభ్యపెట్టడానికి ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెనిగరపు నిరంజన్ కుమార్, వినుకొండ రంజిత్, త్రివేణి, ఖలీల్, విన్ను, తదితరులు పాల్గొన్నారు.