calender_icon.png 23 October, 2024 | 9:56 AM

కుల గణన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలె

07-08-2024 02:04:33 AM

బీసీ కుల సంఘాల డిమాండ్

ఏఐసీసీ కార్యాలయం ముట్టడి 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6(విజయక్రాంతి): సమగ్ర కులగణన చేపట్టకుండా, బీసీ రిజర్వేషన్లు పెంచకుండానే తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడాన్ని నిరసిస్తూ మంగళవా రం ఢిల్లీలోని ఏఐసీసీ జాతీయ కార్యాలయాన్ని బీసీ ఉద్యమకారులు ముట్టడించా రు.

తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై రాహుల్‌గాంధీ తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌చేశారు. కులగణన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తిచేశారు. దేశం మొత్తం సమగ్ర కులగణన జరగాలని ఒకవైపు గొంతు వినిపిస్తున్న రాహు ల్..

తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేయకుండా, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తుంటే  ఎం దుకు జోక్యం చేసుకోవట్లేదని నిలదీశారు.  సమగ్ర కుల గణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే వరకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని స్పష్టంచేశారు.

కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు కుందారం గణేశ్‌చారి, కులకచర్ల శ్రీనివాస్‌ముదిరాజ్, తాటికొండ విక్రమ్‌గౌడ్, మనిమంజరిసాగర్, మహేశ్‌యాదవ్, సింగం నగేశ్, నరేష్ ప్రజాపతి, ఈడిగ శ్రీనివాస్‌గౌడ్, నరసింహనాయక్, ఇంద్ర రజక, స్వర్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

నేడు అమృత్‌సర్‌లో మహాసభ  

దేశవ్యాప్తంగా ఓబీసీ డిమాండ్ల సాధన కోసం బుధవారం పంజాబ్ అమృత్‌సర్‌లో అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ మహాసభకు దేశంలోని అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలు, సుమారు 10 వేల మంది ఓబీసీ ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు.

మహాసభ ఏర్పాట్లను మంగళవారం పలువురు ఓబీసీ నాయకులతో కలిసి పర్యవేక్షించారు. తెలంగాణ అధ్యక్షుడు బైరి రవికృష్ణ, మహారాష్ట్ర ఓబీసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ భబన్‌రావు తైవాడే, పంజాబ్ ఓబీసీ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్, సచిన్ రాజోల్కర్ తదితరులు పాల్గొన్నారు.