జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్
ముషీరాబాద్, నవంబర్ 19 : (విజయక్రాంతి): స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తరువాతే ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ య్య డిమాండ్ చేశారు. అవసరమైతే రా జ్యాంగాన్ని సవరించి ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వర్ రావు ను పలు బీసీ సంఘాల నేతలతో కలిసి వినతిపత్రాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు. విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ సమగ్ర కులగణన చేసి దాని ప్రకారం బీసీ రిజర్వేషన్‌లను పెంచితే చట్టపరమైన అవరోధాలుండవన్నారు.
డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు న్యాయబద్ధత ఉం టుందన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీ య కన్వీనర్ గుజ్జకృష్ణ, ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగె మల్లేశ్ యాదవ్, జిల్లపల్లి అంజి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, అనంతయ్య, రాంకోటి, నిమ్మల వీరన్న, రాజేందర్, మోడీ రాందేవ్, జయంతి, రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు.