బంగ్లా తాత్కాలిక అధినేత యూనస్ కీలక వ్యాఖ్యలు
ఢాకా, డిసెంబర్ 16: వచ్చే ఏడాది చివ ర్లో లేదా 2026 ప్రారంభంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్ మీడియాముఖంగా ప్రకటించారు. దేశం లో రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొ న్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జనవరిలో నే అక్కడ ఎన్నికలు జరగగా, ప్రతిపక్ష పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది.
దీంతో అవా మీ లీగ్ గెలుపు లాంఛనమైంది. షేక్ హసీ నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాత కొద్దిరోజులకు రిజర్వేషన్లపై యువత నిరసనలు చేపట్టగా, చివరకు షేక్ హసీనా పదువీచ్యుతురాలు కావాల్సి వచ్చింది. ప్రస్తుతం అక్కడ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది.